కైరో నుండి ఓరాన్‌కు బయలుదేరిన అమీర్
- June 26, 2022
ఖతార్: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అధికారిక పర్యటన ముగించుకొని ఈజిప్ట్ లోని కైరో నుండి బయలుదేరారు. 19వ మెడిటరేనియన్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుకలకు హాజరు కావడానికి అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్మాజిద్ టెబౌన్ ఆహ్వానం మేరకు అమీర్ ఓరాన్‌కు బయలుదేరాడు. అమీర్, అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి వీడ్కోలు పలికారు. ఈజిప్టు పర్యటనలో తనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యం, సాదర స్వాగతంకు కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేస్తూ ఈజిప్టు అధ్యక్షుడికి అమీర్ ఒక కేబుల్ పంపారు. రెండు దేశాల ప్రయోజనాల కోసం.. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు మద్దతు ఇవ్వడం, మెరుగుపరచడంతోపాటు, ఈజిప్టు ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును అమీర్ ఆ లేఖలో ఆకాంక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







