పని ప్రమాదాల్లో తగ్గుదల

- June 13, 2015 , by Maagulf
పని ప్రమాదాల్లో తగ్గుదల

ఖతార్‌లో గడచిన కొన్నేళ్ళలో ‘పని ప్రమాదాలు’ తగ్గుముఖం పట్టినట్లు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకటించింది. పని చేస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ప్రమాదాలు నివారించగలుగుతామనీ, ఆ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పెంచడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విజయం సాధించిందని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ హమాద్‌ అలీ తని చెప్పారు. భవన నిర్మాణాల్లోనూ, ఇతర సంస్థల్లోనూ కార్మికుల భద్రతే ధ్యేయంగా పలు నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేయడం వల్లే పని ప్రమాదాల్ని నివారించగలిగామని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా గడచిన కొన్నేళ్ళలో గణనీయంగా తగ్గాయి. లక్షలో 26 మంది 2006లో చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 9కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. 

 

--వి.రాజ్ కుమార్(ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com