జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు
- June 27, 2022
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్ బీఐ జారీ చేస్తుంది. దీని ప్రకారం.. జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.
నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. రెండు శనివారాలతో కలిపితే సాధారణ సెలవులు ఏడు ఉన్నాయి. బక్రీద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శని, ఆదివారాలు మినహా బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. పలువురు బ్యాంకులు మూసిఉన్న తేదీలు తెలియ బ్యాంకుల వద్దకు వచ్చి వెనుదిరిగి పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులకు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే మందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు.
జూలై నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ఇక జూలై 9న సెకండ్ శనివారం(అదేవిధంగా బక్రీద్), జూలై 23న నెలలో నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇతర రోజుల్లో జూలై 1న కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర (భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు), జూలై 5న(మంగళవారం) గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ (జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 7న ఖర్చి పూజ (అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 11న ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 13న భాను జయంతి (గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 14న బెన్ డియెంక్లామ్ (షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 16న హరేలా (డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు).
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







