పూజా హెగ్థేని వదల్లేకపోతున్న ‘బీస్ట్’.! రెండోస్సారీ.. నిజమేనా.?
- June 27, 2022
‘బీస్ట్’ సినిమా పూజా హెగ్దేకి తమిళంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నప్పుడు పూజా హెగ్దే చాలా చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీలయ్యింది. సినిమా షూటింగ్ టైమ్‌లో కూడా చాలా ఎంజాయ్ చేశానని ‘బీస్ట్’ ప్రమోషన్లలో చెప్పి తెగ మురిసిపోయింది పూజా హెగ్దే.
కానీ, ‘బీస్ట్’ రిజల్ట్ పూజా హెగ్డేకి ఏం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా, సినిమా ఫ్లాప్‌ని ఓ హీరోయిన్‌కి ఆపాదించేసి, ఆ నష్టాల బాధ్యత కూడా ఆమెదే అని నిందలు మోపడం మరీ దారుణం. ఆ దారుణాలన్నీ ‘బీస్ట్’ సినిమాతో ఫేస్ చేసింది పూజా హెగ్దే.
ఏకంగా ‘బాయ్ కాట్ పూజా హెగ్దే’ అంటూ సోషల్ మీడియా వేదికగా బోలెడంత రచ్చ జరిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే, సిట్యువేషన్ ఇంత క్రిటికల్‌గా వుంటే, విజయ్‌తో బుట్టబొమ్మ మళ్లీ నటిస్తోందట.. అంటూ ఓ తాజా గాసిప్ వేడి వేడిగా చక్కర్లు కొడుతోంది.
ఇది సాధ్యమేనా.? అంటే, ఏమో జరిగినా జరగొచ్చు. విజయ్ ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరితో ‘వారసుడు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చివరి దశకు వచ్చేసింది ఈ సినిమా. దీని తర్వాత ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో విజయ్ సినిమా వుండనుంది.
ఈ సినిమా కోసమే పూజా హెగ్దే పేరు పరిశీలనలోకి వచ్చిందట. అయితే, పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్ కాదు. ఓన్లీ స్పెషల్ సాంగ్‌లో చేయబోతోందట.. అనే గాసిప్ కూడా గుప్పుమంటోంది. ఏది ఏమైనా, ఇంత నెగిటివిటీలోనూ ఈ తరహా గాసిప్ అంటే, కూసింత విచిత్రంగానే వున్నా.. బుట్టబొమ్మలో వున్న మ్యాజిక్ అదే మరి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







