ఈగో లవ్ స్టోరీ: రొమాన్స్ ‘రంగ రంగ వైభోగమే..!’
- June 27, 2022
లవర్స్ మధ్య ఈగో ప్రధాన ఎలిమెంట్‌గా అనేక సినిమాలొచ్చాయి. కొన్ని హిట్ అయ్యాయ్. కొన్ని ఫ్లాప్ అయ్యాయ్. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా ఈగో ప్రధానాంశంగా తెరకెక్కిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసేసిన సంగతి తెలిసిందే.
ఇదే సెకలతో రూపొందినట్లుగా కనిపిస్తోంది ‘రంగ రంగ వైభవంగా’ సినిమా. పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించారు ఈ సినిమాలో. లేటెస్టుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే, అప్పటి ‘ఖుషి’ జ్ఞాపకాలే తలపుకు వస్తున్నాయ్.
హీరో, హీరోయిన్లకు స్వతహాగా ఇష్టం వున్నా, వారి మధ్య వున్న ఈగో కారణంగా చిన్న చిన్న విషయాలకే గోడవలు పడుతుంటారు. మెడికల్ స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు ఈ సినిమాలో కేతిక, వైష్ణవ్. గొడవలెలా వున్నా, కెమిస్ర్టీ విషయానికి వస్తే, కేక పుట్టిస్తోంది ఈ జంట. యూత్‌కి ఇంతకన్నా కావల్సిందేముంది. పక్కా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా ఇప్పటికే ముద్ర వేయించేసుకుంది. అన్నట్టు ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ గిరిశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ అగ్రహీరో విక్రమ్ తనయుడు ధృవ్‌తో ‘అర్జున్ రెడ్డి’ సినిమాని ‘ఆదిత్య వర్మ’గా రీమేక్ చేసిన డైరెక్టరే ఈ గిరీశాయ. ఆ సినిమాతో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో తెలుగులో తన సత్తా చూపించబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







