సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం

- June 27, 2022 , by Maagulf
సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం

బహ్రెయిన్: ఆరవ హై సివిల్ కోర్టు, ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ 50,000 బహ్రెయినీ దినార్లను సబ్ కాంట్రాక్టర్‌కి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే, సబ్ కాంట్రాక్టర్‌కి ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ బ్యాలన్స్ మొత్తాన్నీ చెల్లించడంలో విఫలమయ్యింది. అగ్రిమెంట్ ప్రకారం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో బాధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కేసు విచారణ అనంతరం, ఏడు శాతం వడ్డీతో చెల్లింపులు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com