నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- June 28, 2022
తెలంగాణ: భారత్ లోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2.. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో.. టీ హబ్-2ని నిర్మించారు. ఇందులో.. ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. శాండ్‌విచ్ ఆకారంలో కనిపిస్తూ.. అట్రాక్ట్ చేసేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో.. ప్రతీది ఓ అద్భుతంగా కనిపిస్తోంది.
ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఐదేళ్లు క్రితం టీ-హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మూడెకరాల్లో.. 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం.. 3 లక్షల 70 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా నిలువబోతోంది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి యూనికార్న్ స్టార్టప్‌లు, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్ కేర్, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు సీక్యా క్యాపిటల్, యాక్సిల్, ఎండియా పార్ట్‌నర్స్ హాజరుకానున్నాయి. అలాగే కలారి క్యాపిటల్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్ర బ్యాంక్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ప్రారంభోత్సవంలో పాల్గొంటాయి. ఈ కొత్త బిల్డింగ్‌లో ఒకేసారి 15 వందలకు పైగా స్టార్టప్‌ల ఏర్పాటుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!