టాలీవుడ్ తెరపై సోనాక్షి సిన్హా: ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోందా.?
- June 28, 2022
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు చాలా టెక్కు చేసేవారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. సౌత్ సినిమాని చిన్న చూపు చూసేవారు. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే, ససేమిరా అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే మాటే లేదు. ‘ఇండియన్ సినిమా’గా సినిమా చెలామణీ అవుతోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. దాంతో నార్త్ భామలు సౌత్‌లో సినిమాలు చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లయిన శ్రద్ధా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనె, దిశా పటానీ తదితరులు తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.
ఇప్పుడు సోనాక్షి సిన్హా వంతు వచ్చింది. గతంలోనూ సోనాక్షికి కొన్ని తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయ్. కానీ, అప్పట్లో కాదనుకుంది. ఇప్పుడు కోరుకున్నా దక్కించుకోలేకపోతోంది. ఇక, తాజాగా ఓ తెలుగు సినిమా కోసం సోనాక్షితో సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓ సీనియర్ నటుడి సినిమా కోసం సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఆ ప్రాజెక్ట్ చేయడానికి సోనాక్షి రెడీగానే వుందట. ఓ ప్రముఖ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతోందట. ఆ సీనియర్ హీరో ఎవరు.? ఏంటా పెద్ద బ్యానర్.? అనేవి ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!