హజ్ రిజిస్ట్రేషన్ రద్దుకు ఛార్జీలు మినహాయింపు
- June 29, 2022
మక్కా: హజ్ రిజర్వేషన్‌ను స్వదేశీ యాత్రికుడు రద్దు చేసుకున్న సందర్భంలో ఎటువంటి రుసుములు వసూలు చేయబడదని హజ్-ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.దేశీయ యాత్రికుల కోసం కంపెనీలు, సంస్థలను అందించే హజ్ సర్వీస్ కోసం రెగ్యులేటరీ ప్రొసీజర్స్ గైడ్‌లో ఈ సమాచారం స్పష్టం చేసినట్లు పేర్కొంది.జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే 2022 హజ్ కోసం దేశీయ యాత్రికులు చేసిన రిజర్వేషన్‌లను రద్దు చేసే విధానాలను ప్రొసిజర్స్ గైడ్ లో పొందుపరిచినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.దుల్ హిజ్జా మొదటి రోజు హజ్ ప్యాకేజీ ధరను చెల్లించిన తర్వాత కానీ హజ్ పర్మిట్‌ను ముద్రించడానికి ముందు లేదా తర్వాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన సందర్భంలో ప్రతి యాత్రికుడి నుండి SR71.75, SR8.05 మొత్తాన్ని బ్యాంక్ బదిలీ రుసుముగా వసూలు చేస్తారని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. అలాగే దుల్ హిజ్జా రెండవ రోజున హజ్ అనుమతిని ముద్రించిన తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిన సందర్భంలో 30 శాతం.. దుల్ హిజ్జా మూడవ రోజున రద్దు చేయబడితే, ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువ నుండి 40 శాతాన్ని తగ్గిస్తారని మంత్రిత్వ శాఖ వివరించింది.దుల్ హిజ్జా నాల్గవ రోజున రద్దు చేస్తే.. ప్యాకేజీ మొత్తంలో 50 శాతం తగ్గింపు ఉంటుంది.ధుల్ హిజ్జా ఐదవ రోజున రద్దు అయినట్లయితే కాంట్రాక్ట్ విలువలో 60 శాతం తగ్గింపు ఉంటుందని.. దుల్ హిజ్జా 6న రద్దు చేయబడితే 70 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపింది.దుల్ హిజ్జా ఏడవ రోజున రద్దు అయినట్లయితే ప్రతి దరఖాస్తుదారుడు SR71.75, బ్యాంక్ బదిలీ రుసుము SR8.05 చెల్లింపు చేయడంతో పాటు ప్యాకేజీ పూర్తి మొత్తం (100 శాతం) తీసివేయబడుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!