చిత్రసీమలో మరో విషాదం: ప్రముఖ నటి మీనా భర్త మృతి
- June 29, 2022
చెన్నై: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) కన్నుమూశారు.అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యాసాగర్ గత రాత్రి చెన్నైలో మృతి చెందారు.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు.వీరికి ఓ కుమార్తె ఉంది. ప్రాణానికి ప్రాణంగా భావించే భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త మృతివార్తతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెకు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాసాగర్ కొద్ది సంవత్సరాలుగా లివర్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నారు.ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని హాస్పిటల్లో చేర్పించారు.ఆయనకు ఈ వ్యాధి పావురాల మల,మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.కొద్ది నెలలుగా ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
లివర్‌లో ఇన్ఫెక్షన్ జనవరి మాసంలో మరింత పెరిగింది.మీనా దంపతుల కుటుంబం మొత్తం జనవరిలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు.ఆ తర్వాత విద్యాసాగర్‌కు ఇన్ఫెక్షన్ మరింత పెరిగింది. కోవిడ్‌తో కోలుకొన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మరింత విషమించింది అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.మీనా కుమార్తె ఇటీవల థెరీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.అయితే విద్యాసాగర్ అంత్యక్రియలు ఈరోజు అంటే జూన్ 29వ తేదీన చెన్నైలో నిర్వహిస్తారని సన్నిహితులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..