ఎనిమిది గంటలపాటు అల్ వక్రా రహదారి మూసివేత
- June 29, 2022
దోహా: అల్ వక్రా మెయిన్ రోడ్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్యాంట్రీని ఇన్‌స్టాల్ చేయడానికి అల్ వక్రా టన్నెల్, అల్ వక్రా ఇంటర్‌సెక్షన్‌తో సహా అల్ వక్రా వైపు రహదారి మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ తెలిపింది. ఈ మేరకు అష్ఘల్ ట్వీట్ చేసింది. జూలై 1, 2022 (శుక్రవారం) ఉదయం 2 నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు రహదారి మూసివేత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో ట్రాఫిక్‌ను అల్ వక్రా న్యూ రోడ్డు మీదుగా మళ్లిస్తారని పేర్కొన్నారు. దోహా నుండి అల్ వక్రా వైపు వచ్చే వాహనదారులు బార్వా విలేజ్ వైపు కుడివైపుకు తిరిగి, ఆపై అల్ వక్రా కొత్త రహదారిపై ఎడమవైపుకు తిరిగి, వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!