వాట్సాప్ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు..
- June 29, 2022
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ పోతుంటారు. కొన్నిసార్లు గ్రూపులో సభ్యుల కారణంగా అందులో నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. అయితే ఇలా ఎగ్జిట్ అయిన ప్రతి గ్రూపులో ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయినట్టు అందులోని సభ్యులందరికి తెలిసిపోతుంది. కానీ, రాబోయే ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్ అయిన విషయం మీకు, మీ గ్రూపు అడ్మిన్‌కు మాత్రమే తెలిసే వీలుంది. మీరు గ్రూపులో నుంచి సైలెంటుగా ఎగ్జిట్ అయిపోవచ్చు. అది మీకు, మీ గ్రూపు హోస్టుకు మాత్రమే తెలుస్తుంది. మీరు ఎప్పుడూ గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయ్యారో కూడా సభ్యులకు తెలియదు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్ కాగానే.. మీకు exit అయినట్టుగా ఒక మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. అది గ్రూపులోని అందరి సభ్యులకు కనిపిస్తుంది. తద్వారా మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయ్యారనే విషయం అందరికి తెలిసిపోతుంది.
ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మీరు గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయిన విషయం తెలియదు. ఎగ్జిట్ మెసేజ్ చాట్ బాక్సులో డిస్‌ప్లే కాదు. చాలామంది వాట్సాప్ యూజర్లు అనేక గ్రూపుల్లో జాయిన్ అవుతుంటారు. కొన్నిరోజులకు ఆ వాట్సాప్ గ్రూపులో మీకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే అందులో నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ మీ ఎగ్జిట్ మెసేజ్ వాట్సాప్ చాట్ బాక్సులో కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఎగ్జిట్ అయినా సభ్యులు ఎవరికి కనిపించదు. అయితే మీరు గ్రూపు అడ్మిన్ కు మాత్రం తెలుస్తుందని గుర్తించుకోండి. మెసేజింగ్ యాప్‌కు సంబంధించిన ట్రాకింగ్ చేసే Wabetainfo నివేదిక తెలిపింది. ఫీచర్స్ ట్రాకర్ ప్రకారం.. వాట్సాప్ చాట్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది.
వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గ్రూపులో నుంచి ఎవరు ఎలా ఎగ్జిట్ అయ్యారు అనేది చూడటం ఇప్పటికీ సాధ్యమేనని Wabetainfo బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆ కొత్త ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని Wabetainfo నివేదించింది. ఇంకా బీటా టెస్టర్‌లకు అందుబాటులో రాలేదు. ఎంపిక చేసిన కాంటాక్ట్‌ల నుంచి చివరిగా చూసిన, ప్రొఫైల్ ఫొటో స్టేటస్ అప్ డేట్స్ హైడ్ చేసే ఫీచర్లను వాట్సాప్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో మీ ప్రైవసీని మరింత పెంచడానికి మీ ప్రైవసీ కంట్రోల్ సెట్టింగ్‌లకు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొస్తాం. మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి మీ ప్రొఫైల్ ఫొటో గురించి చివరిగా చూసిన స్టేటస్ ఎవరు చూడగలరో ఎంచుకోవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







