జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 51మంది మృతి
- June 29, 2022
తులువా: నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో 51మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







