సామాజిక మాధ్యమాల్లో హత్యా వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం నేరం

- June 30, 2022 , by Maagulf
సామాజిక మాధ్యమాల్లో హత్యా వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం నేరం

షార్జా: శుక్రవారం నాడు షార్జాలో హత్యకు గురైన మహిళ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తి కోసం షార్జా పోలీసులు గాలిస్తన్నారు.హత్య చేసిన నిందితుడిని రెండు గంటల్లోనే పట్టుకున్న పోలీసులకు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలు పెద్ద తలనొప్పిగా మారాయి.  

అలాగే, ప్రజలను ఉద్దేశించి షార్జా పోలీసులు మాట్లాడుతూ హత్యకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నవారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చేసే ఈ పైశాచిక చర్యల కారణంగా బాధితురాలి కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోతోంది.యూఏఈ సైబర్ నేరాల చట్టంలోని ఆర్టికల్ 44 ప్రకారం హతురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ చేయడం  చట్టరీత్యా నేరంగా పరిగణిస్తూ ఉన్నాము. అందుకు తగ్గట్టుగానే భాద్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. 

ప్రస్తుతం షార్జా పోలీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన నిందితుడిని పట్టుకునేందుకు సీసీ టీవి పుటేజీల ఆధారంగా చేసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com