ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ..
- June 30, 2022
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , బిజెపి అగ్ర నేతలు హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పటు చేసింది.
హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. జూలై 03వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ తరుణంలో మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ను విడుదల చేసారు.
మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
జులై 02 న
12 .45 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి ప్రధాని బయలుదేరుతారు.
2 .55 బేగం పేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు.
3.00కు బేగం పేట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో పయనం.
3.20 HICC నోవాటెల్ కి ప్రధాని చేరిక.
3.30 నోవాటెల్ కన్వేషన్ సెంటర్ కి ప్రధాని.
3.30 నుండి 4 గంటల వరకు రిజర్వ్.
సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ హాజరు
రాత్రి 9 గంటలు నుండి రిజర్వ్.
3.07.22 :
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు.
సాయంత్రం 4. 30 నుండి 5.40 వరకు రిజర్వ్.
సాయంత్రం 5.55 HiCC వద్ద హెలిప్యాడ్ వద్దకు ప్రధాని.
సాయంత్రం 6.15 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
6.30 నిమిషాలకి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ కు పయనం.
6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.
రాత్రి 7.35 గంటలకు బహిరంగ సభ నుండి మోడీ పయనం.
ఆ రాత్రికి నోవాటెల్ లేదా రాజ్ భవన్ లో మోడీ బస.
4.07.22 :
ఉదయం 9.20కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి మోడీ.
బేగంపేట నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో పయనం.
10.10 నిమిషాలకు విజయవాడ చేరుకొనే అవకాశం.
ఇందులో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉందంటున్న పోలీసులు. హైదరాబాద్ లో పర్యటన సందర్భంగా.. సోషల్ మీడియాపైన ప్రత్యేక మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎప్పటికప్పుడు ఆ వింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్ చెక్ చేస్తూ ఉంటుందని తెలపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







