మ్యూజికాలజిస్ట్ హాసం రాజా కు ఉగాది పురస్కారం
- April 11, 2016
తెలుగు చలనచిత్ర సంగీతానికి సంబంధించిన సాధికార సమాచారానికి, విశ్లేషణలకు పెట్టింది పేరు హాసం రాజాగా పాపులర్ అయిన మంగు రాజా. మ్యూజికాలజిస్ట్ గా సినిమా పాటలను విశ్లేషించడమే కాకుండా వాటి తమిళ, హిందీ, కన్నడ, బెంగాళీ, ఇంగ్లీషు పాటల మూలాలను వెలికితీసి పరిశోధించి ఆ వివరాలను నలభై ఏళ్లుగా అందిస్తూనే ఉన్నారు ఆయన. సినిమా పాటలను ఒక పరిశోధనాంశంగా పరిచయం చేసారు. ఆ పాటల సాహిత్యం కావాలన్నా, సంగీతాభిమానులకే కాకుండా పత్రికలు, ఛానల్స్, అవార్డు కమిటీలు సినీ పరిశ్రమలోని వారికి సాధికరంగా అందచేసేది ఆయనే. గత నాలుగు దశబ్ధాల్లో నలభై వేలకు పైగా పాటలను వెయ్యికి పైగా సినీ సమాచార గ్రంధాలను సేకరించి...ఆయన కొనసాగిస్తున్న సినీ గీతా యజ్ఞం ఎందరికో మార్గదర్శకం కావాలని ఢిల్లీ తెలుగు అకాడమీ కోరుకుంటూ ఈ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని హాసం రాజాకు అందచేసి సన్మాన్మించింది. ఈ సందర్భంగా హాసం రాజా స్పందిస్తూ....తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో పాటల పై పరిశోధన ప్రారంభించాను. ప్రతి శ్రోతకి పాటల వివరాలు అందుబాటులో ఉండేందుకు రాజామ్యూజిక్ బ్యాంక్.కామ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరుస్తున్నాను. ఇప్పటి వరకు నలభై వేల పాటలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాను. నా పుట్టుక తల్లిదండ్రులకు సంబంధించింది..నా చావు భార్యబిడ్డలకు సంబంధించింది నా బతుకు తెలుగు సినిమా పాటకి అంకితం. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటల గురించి గవర్నమెంట్ ఓ కమిటీ వేసి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. నేను ఇప్పటి వరకు సేకరించిన పాటల నిథిని గవర్నమెంట్ కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. త్వరలో ఈ విషయం పై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గార్ని కలుస్తాను. తెలుగు సినిమా పాటల పూర్తి వివరాలను సేకరించాలనే ఆసక్తి నాలో ఏర్పడడం...ఈరోజు నలభై వేల పాటలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







