‘పుష్ప 2’ కి ఆడిషన్సా.? ఇదెక్కడి చోద్యం చెప్మా.!
- July 01, 2022
అవునండీ మీరు విన్నది నిజమే. ‘పుష్ప 2’ కోసం ఆడిషన్లు జరుగుచున్నవి. చిన్న పిల్లల నుంచి, పెద్ద వయసు వాళ్ల వరకూ ఆసక్తి వున్న వాళ్లు ఎవరైనా ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. సుకుమార్ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ కొట్టేయొచ్చు. పోలా.. ఆఫర్ అదిరిపోలా.!
ఆఫర్ సంగతి సరే, ‘పుష్ప 2’ కోసం ఇప్పుడు ఆడిషన్లేంటీ మహాప్రభో.! అంటూ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఇంకా ఆడిషన్స్ దగ్గరే వుంటే ఈ సినిమా ఇంకెప్పుడు పట్టాలెక్కేది.? అని వాపోతున్నారు.
వాస్తవానికి ఎప్పుడో ‘పుష్ప 2’ సెట్స్ మీదికెళ్లి ఈ పాటికే సినిమా పూర్తయిపోవల్సి వుంది. ఎందుకంటే, ఆల్రెడీ ‘పుష్ప’ ఫస్ట్ సిరీస్ చిత్రీకరించినప్పుడే, సెకండ్ సిరీస్ షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తయిపోయిందట. కానీ, ‘పుష్ప’ ఫస్ట్ సిరీస్ సక్సెస్ తెచ్చిన ఇంపాక్ట్‌తో రెండో సిరీస్‌పై పునరాలోచనలో పడ్డారట సుక్కు అండ్ టీమ్.
అలా మొదట్నుంచీ ఈ సినిమా షూట్ చేయాలనే వుద్దేశ్యంతోనే ఇంత జాప్యం చేస్తున్నారట. అందులో భాగంగానే సినిమాకి అదనపు ఎట్రాక్షన్స్ అద్దే క్రమంలో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ అనౌన్స్ చేశారట పుష్ప టీమ్.
జూలై 3, 4, 5 తేదీల్లో ఈ ఆడిషన్లు జరుగుతాయట. ఆడిషన్‌లో పాల్గొనేవారికి చిత్తూరు యాస ఖచ్చితంగా వచ్చి వుండాలట. అంతా బాగానే వుంది. కానీ, ‘పుష్ప 2’ విషయంలో చేస్తున్న ఓవరాక్షన్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హర్టవుతున్నారు మరి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







