‘హ్యాపీ బర్త్ డే’: ఇన్నోవేటివ్ థాట్స్ సూపర్బ్ గురూ.‘
- July 01, 2022
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రితేష్ రాణా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘హ్యపీ బర్త్ డే’ అంటూ ఈ సినిమాకి టైటిల్ పెట్టారు. టీజర్లు, ట్రైలర్లు ఒకదానికి మించి.. అనే రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. రెస్పాన్స్ కూడా ఆ రేంజ్‌లోనే దక్కించుకుంటున్నారు చిత్ర యూనిట్.
గన్ కల్చర్ నేపథ్యంలో కామెడీగా రూపొందించిన సినిమా ఇది. ఏడు వారాల నగలు అమ్మేసి గన్ తయారు చేయించుకోవడమేంట్రా బాబూ.. ఎవ్వరి చేతుల్లో చూసినా గన్నులే.. నో గన్ నో ఎంట్రీ అనే బోర్డులు.. వీళ్లూ, వాళ్లూ అనే తేడా లేదు.. అందరూ గన్ను పేల్చాల్సిందే సినిమాలో.
అదే ఈ సినిమా స్పెషాలిటీ. ఓ థ్రిల్లర్ కాన్సెప్టుకి కామెడీని జోడించి క్యూరియాసిటీగా తెరకెక్కించారు ఈ సినిమాని. అందుకే ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి ఈ సినిమాపై. సినిమా ప్రమోషన్లు కూడా చాలా ఇన్నోవేటివ్‌గా చేస్తున్నారు. చిన్న సినిమానే అయినా, పెద్ద సినిమా రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారు.
రాజమౌళితో ట్రైలర్ రిలీజ్ చేయించి ఇంకాస్త అంచనాలు పెంచేశారు. అన్నట్లు చిన్న సినిమానే అయినా, ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ వాళ్లు ఈ సినిమాని రూపొందించారు. జూన్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠితో పాటు, కమెడియన్ వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







