ఆహార నిల్వలు మరియు ధరలు స్థిరంగా ఉన్నాయి
- July 02, 2022
బహ్రెయిన్: దేశ పౌరుల అవసరాల నిమిత్తం కావల్సినంత నిత్యవసర వస్తువులు ,ఆహార నిల్వలు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి అని పరిశ్రమల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.అంతేకాకుండా వాటి ధరల్లో ఏటువంటి మార్పులు లేవని కూడా స్పష్టం చేయడం జరిగింది.
ఈ సందర్భoగా మార్కెట్లలో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసిన పర్యాటక మరియు పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వశాఖల సహాయ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ అల్ అష్రఫ్ మాట్లాడుతూ మార్కెట్ వర్గాలు కుమ్మక్కై ధరల పెంపు , బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే తగినన్ని ఆహార నిల్వలు మార్కెట్లలో ఉన్నాయి అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూనే వ్యాపారాలు నాణ్యతతో కూడిన నిత్యవసర వస్తువులను డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు సరఫరా చేయాలని సూచించారు. ఇలా కాకుండా నాణ్యత లేని వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా ధరలకు సంబంధించి వందతులు వ్యాప్తి చేసిన వారిపై ప్రజలు వాట్సప్, మెయిల్ మరియు కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
వాట్సాప్ నంబర్ : 17111225
కాల్ సెంటర్ నంబర్ : 80001700
మెయిల్ ఐడి : Tawasul or [email protected]
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







