భారత్: రైల్వే ప్రయాణికులకు అలర్ట్..
- July 02, 2022
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ పేమెంట్స్ నిర్వహించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రైల్వే సౌకర్యాలకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు జరిపేలా భారత రైల్వే శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రైల్వేస్టేషన్లలో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో క్యాష్‌కు బదులుగా డిజిటల్ పద్ధతిలో పేమెంట్స్ చేసుకోవచ్చు.
నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. ఈ మేరకు యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్‌సేల్ మెషిన్‌లు, స్వైపింగ్ మెషీన్‌లను ఉంచుకోవడం తప్పనిసరిగా ఆదేశాల్లో పేర్కొంది. ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాల్సిందిగా సూచించింది. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంపై ఏ వస్తువునైనా MRP ధరకే స్టాల్ నిర్వాహకులు విక్రయించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ కొత్త విధానాన్ని రైల్వే శాఖ అమల్లోకి తీసుకొస్తోంది.
తద్వారా ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి అమ్ముతున్న పరిస్థితి ఉంది. క్యాష్ లెస్ చెల్లింపులతో అధిక ధరకు విక్రయించడం కుదరదు. క్యాటరింగ్ క్యాష్‌లెస్ చెల్లింపులపై గతంలోనే రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది. స్టాల్స్‌తో పాటు ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్లలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రైల్వే బోర్డు పేర్కొంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







