బలపరీక్షలో నెగ్గిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
- July 04, 2022
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే బలపరీక్షలో నెగ్గారు. షిండే సర్కారుకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.దీంతో ఏక్ నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్‌గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్నాథ్ సీఎం అయ్యారు. అయితే ఆయన ఇవాళ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ ఓటింగ్‌లో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







