భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- July 05, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమాన సంస్థ అధికారులు తెలిపారు.
స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ SG-11 (ఢిల్లీ-దుబాయ్) ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులను సురక్షితంగా దించామని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కన్నారు.
ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని, విమానం సాధారణ ల్యాండింగ్ చేశామని ఆయన తెలిపారు. విమానంలో ఎటువంటి లోపం ఉన్నట్లు బయల్దేరే సమయంలో తెలియలేదు.ప్రయాణికులకు స్నాక్స్ అందించారు. ఆ తర్వాతే ఇలా జరిగింది.
“ఇక్కడి నుంచి ప్రయాణికులను దుబాయ్‌కి తీసుకెళ్ళేందుకు ఓ ఆల్టర్నేటివ్ విమానం కరాచీకి పంపనున్నాం” అని ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







