‘బింబిసార‌’ లో యంగ్ టైగర్ ఎన్టీయార్.?

- July 05, 2022 , by Maagulf
‘బింబిసార‌’ లో యంగ్ టైగర్ ఎన్టీయార్.?

ఈ మధ్య విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాకి, గతంలో వచ్చిన కార్తి ‘ఖైదీ’ సినిమాకీ ఎక్కడో లింకులు పెట్టి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. నిజంగానే కార్తి సినిమాని ‘విక్రమ్’ సినిమాతో కనెక్ట్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అలాగే, ‘విక్రమ్’లో  క్లైమాక్స్ సీన్‌లో ‘రోలెక్స్’ అనే క్యారెక్టర్‌ని దించి నెక్స‌ట్ పార్ట్‌లో ఈ క్యారెక్టర్ హైలైట్ చేస్తూ సీక్వెల్ వుంటుందనే హింట్స్ వదిలి పెట్టాడు డైరెక్టర్.

అలాగే, ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతోన్న ‘బింబిసార’ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ హల్‌చల్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా నుంచి లేటెస్టుగా ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా వుంది.
దాంతో, ఈ సినిమాకి సంబంధించి రకరకాల గాసిప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ వుండబోతోందనీ, ఆ పార్ట్‌లో ఎన్టీయార్ నటించనున్నాడనీ, అందుకు సంబంధించిన లింకు మొదటి పార్ట్‌లో వదిలి పెట్టనున్నారనీ వేడి వేడిగా కథనాలు వండి వడ్డించేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి.. రిజల్ట్ ఆశించిన విధంగా వుండాలి. అప్పుడేగా సెకండ్ పార్ట్ గురించి ఆలోచించాలి. 

కానీ, ఈ లోపే ‘బింబిసార’పై ఏంటీ ఇంత హైప్.? ఇదంతా సినిమాపై అంచనాలు పెంచడానికే అంటున్నారు ఓ వర్గం సినీ ప్రియులు. ఏది ఏమైతేనేం, అప్పట్లో పెద్ద ఎన్టీయార్ నటించిన ‘పాతాళ భైరవి’ తదితర ఫాంటసీ మూవీల తరహాలో తెరకెక్కుతోన్న సినిమాగా ‘బింబిసార’ను అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా వుండబోతోందనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. సంయుక్తా మీనన్, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com