నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దుబాయ్ తెలుగు అసోసియేషన్
- July 05, 2022
యూఏఈ: యూఏఈలోని ఫుజైరాలో ఒక క్వారి సంస్ధలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారితో సహా 20 మంది భారతీయులు చాలా కాలంగా పని చేస్తున్నారు.కానీ గత సంవత్సరం నుండి వీరికి సంస్ధ వేతనాలు చెల్లించడం లేదు.స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్న వారికి గ్రాట్యూటి, బకాయి వేతనాలు కూడా ఇవ్వడం లేదు.ఒక వైపు రావల్సిన బకాయిలు రాలేక, జీతం లేక తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
వీరి దయనీయ స్ధితి గురించి భారతీయ కాన్సులేట్ ద్వారా దుబాయ్ లోని తెలుగు అసోసియెషన్ తెలుసుకుని అండగా నిలిచింది.అసోసియేషన్‌కు చెందిన సాయి ప్రకాశ్,సాయికృష్ణా, చైతన్య, భీంశంకర్, ఫహీం,విజయభాస్కర్‌లు ఈ మెరకు ఫుజైరాకు వెళ్ళి ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నెలరోజులకు సరిపడా ఆహార సామాగ్రి,ఇతర నిత్యావసర సరుకులు అందించారు.ఈ క్రమంలో దుబాయ్ లోని భారతీయ కాన్సులేటులోని కౌన్సల్ తాడు మాము తెలుగు అసోసియెషన్ ప్రతినిధులను అభినందించారు.దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ లు గతంలోనూ అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







