24 చిత్రంలోని ఓ పాటను నిత్యామీనన్ పాడింది...
- April 11, 2016
హీరో,హీరోయిన్‌లు గాయకులుగా మారుతున్న వేళ, ఓ మలయాళీ భామ మరోసారి తన గళాన్ని తెలుగు ప్రేక్షకులకు వినిపించనుంది. అయితే ఈ భామ మలయాళీ అయినప్పటికి తన తొలి సినిమాకు ఓన్ డబ్బింగ్ చెప్పుకొని, అందులో ఓ పాట కూడా పాడింది. మరి ఆమె ఎవరో కాదు నిత్యామీనన్. అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం సూర్య నటిస్తున్న 24 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.మనం చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ కుమార్ తమిళ స్టార్‌హీరో సూర్యతో 24 అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య మూడు భిన్న పాత్రలలో కనిపించనున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మే లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, నిన్న ఉదయం చెన్నైలో 24 చిత్ర ఆడియో వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో తెలుగు ఆడియోను విడుదల చేశారు . 24 చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఈ చిత్రంలోని ఓ పాటను నిత్యామీనన్‌తో పాడించాడు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ పాట తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయం కావడం విశేషం. చంద్రబోస్ రాసిన లాలిజో అంటూ సాగే ఈ పాటను నిత్యా పాడింది. తమిళంలో ఇదే పాటను శక్తి శ్రీ గోపాలన్ పాడింది. నిత్యామీనన్ గుండె జారి గల్లంతయిందే చిత్రంలో కూడా ఓ పాట పాడిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







