కేంద్రం హామీతో బంగారం వర్తకులు బంద్ ముగిసింది..
- April 12, 2016
కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నును వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వారాలుగా బంగారం వర్తకులు చేస్తున్న బంద్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో దేశంలో సగానికి పైగా బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి బంగారు వర్తకులకు వేధింపులు లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తమ బంద్ ను ఆపివేశామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్ రాజ్ బమాల్వ తెలిపారు.ఆరు వారాల తర్వాత తెరుచుకున్నా షాపుల్లో బంగారు డిసౌంట్స్ పడిపోతున్నాయి. 40 డాలర్లుగా ఉన్న బంగారు డిసౌంట్స్ ను డీలర్లు 25 డాలర్లకు ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు ఇది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోందని ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు.బంగారు దుకాణాల బంద్, ధరలు ఎక్కువగా ఉండటంతో మార్చి క్వార్టర్ లో గోల్డ్ కొనుగోలు తగ్గాయని, ఏడు ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని పేర్కొన్నారు. ఈ వారాంతం వరకు అన్ని బంగారు దుకాణాలు తెరుచుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







