ఘంటసాల కి భారతరత్న కోసం అందరం కలిసి పోరాడుదాం: మంత్రి రోజా

- July 07, 2022 , by Maagulf
ఘంటసాల కి భారతరత్న కోసం అందరం కలిసి పోరాడుదాం: మంత్రి రోజా

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 140 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇందులో భాగంగా యు.యెస్.ఏ. నుంచి రామ్ దుర్వాసుల వ్యాఖ్యాతగా 03 జులై 2022 నాడు జరిగిన అంతర్జాల(Zఊం) కార్యక్రమములో, కార్యక్రమ ముఖ్య అతిథి  ఆర్.కె.  రోజా గారు  టూరిజం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి,  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,  మాట్లాడుతూ ఘంటసాల గారి పేరు వినపడగానే మన అందరికి ఒక మధురమైన పాట గుర్తుకువస్తుంది, ఎన్నో మధురమైంన పాటలు పాడి  ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిన ఘంటసాలగారి గురుంచి మనం మరోసారి గుర్తు చేసుకొని అవకాశం వచ్చింది, 100 సంవత్సరాల వసంతోత్సవం జరుగుతున్నవేళ... ఈ సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలి అనేది  ప్రతి తెలుగువాడి కోరిక... ఏ గాయకుడికిలేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 48 విగ్రహాలు, 3 దేవాలయాలలో నిత్యం ధూప దీప నైవేద్యాలతో  భగవంతుడిగా ఆరాధిస్తున్నారు... అందరికి తెలియని మరొక విషయం వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.. అలాగే మరొక అరుదైన అవకాశం అన్నమయ్య తరువాత  ఘంటసాల గారికి మాత్రమే దక్కింది తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ముందు పాడే అవకాశం... అందుకనే తెలుగువారందరము వారికీ భారతరత్న రావాలని గట్టిగ ప్రయత్నిద్దాము, సాదిద్దాము.

 మరొక ముఖ్య అతిథి  నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు: టాలీవుడ్ నంది, సినీమా అవార్డులు గ్రహీత తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ఘంటసాల అమర గాయకుడని చెపుతూ వారి భగవద్గీతని వింటున్నప్పుడు భగద్గీతని గానం చేయడం కోసమే ఘంటసాల గారు జన్మించారా  అనిపిస్తుందని, తనకైతే సాక్షాత్తు ఘంటసాల గారే కృష్ణుడికి భగవద్గీతని భోదించినట్టుగా ఉంటుందని, అది వింటున్నప్పుడల్లా ఒళ్ళు పులకరించి కృష్ణ పరమాత్ముడు  సాక్షత్కరిస్తున్నట్టుగా ఉంటుందని, అంత అద్భుతంగా మనందరికీ భగవద్గీతని పాడి వినిపించారని, అందుకే వారు అమరగాయకుడు అయ్యారని  కొనియాడారు.  ఇంకొక విషయం తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహాదీక్ష చేస్తూ చనిపోయినపుడు వారికి అంత్యక్రియలు జరపడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో తన ఉత్త్తేజమైన పాటలతో మద్రాస్ లో ఉన్న తెలుగువారందని రప్పించి వారికీ అంత్యక్రియలు దగ్గరవుండి జరిపించారని, ఇది ప్రతి తెలుగువాడు తెలుసుకోవలసిన విషయమని చెపుతూ, ఇవ్వాళా యావత్ భూగోళంలో నివసిస్తున్న తెలుగు వారందరు ఏకతాటిపై వచ్చి వారికీ భారతరత్న ఇవ్వాలని మీరందరు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందించారు.

మరొక విశిష్ట అతిధి, టాలీవుడ్  గీత రచయిత, ఫిలింఫేర్, సైమా, నంది, సినీమా అవార్డుల విజేత  రామజోగయ్య శాస్త్రిమాట్లాడుతూ అమరగాయకుడు, కారణజన్ముడు వారి 100 జయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలనే ఒక నినాదంతోటి, ఆకాంక్షతో తలపెట్టిన ఈ కార్యక్రమములో పాల్గొనడం సంతోషంగ వుంది... చాలా బాధ్యాయుతంగా ఈ కార్యక్రమములో పాలుఁగొంటున్నాను అని చెపుతూ, చాలామందికి మరణాంతరం భారతరత్న ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి వాళ్ళలో ముందువరుసలో ఉండే వారు ఘంటసాల, ఆయనొక్క విశిష్టతని, బహుముఖప్రజ్ఞని ఎంత చెప్పినా తనివితీరదని తెలియచేస్తూ, వారి  మంచి గాయకులూ, స్వరకర్త అని చెపుతూ తనకి  బాగా నచ్చిన పాట డా. చక్రవర్తి సినిమాలోని " మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాడి ప్రేక్షకులను అలరించారు... ఏ కళాకారుడుకైనా కళ అనేది భగవత్ ప్రసాదంగా వస్తుందని, వ్యక్తిత్వం అనేది మనం పెంపొందించుకుంటే వస్తుందని... అలాంటి ఒక కళాకారుడు వ్యక్తిగా ఎంత విశిష్టంగా, ఔన్నత్యంగా, ఉన్నతంగా ఆదర్శప్రాయంగా జీవించారని అనేది చాల ముఖ్య విషయం  అవుతుందని తెలియచేస్తూ ఆ కోణంలో నేను వారికీ భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను.

చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొని  వారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ టూరిజం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కె రొజా ని కలిశానని చెపుతూ, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, నిర్వాహుకుల చేస్తున్న ప్రయత్నాలను తెలియచేసినప్పుడు వారు చాలా సంతోషించి నిర్వాహుకులందరిని అభినందచారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించి ఈ మహాయజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేస్తనని రోజా గారు హామీ ఇచ్చారు అని తెలియచేసారు... ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఘట్టానికి చేరిందని సంతోషం తెలియచేస్తూ ... రోజా గారిని కలవడానికి సహాయపడిన బాల ఇందుర్తి ని ఘంటసాల కుటుంభం తరుపున కృతజ్ఞతలు తెలియచేసారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సేవలను కొనియాడారు. 

యు.యెస్.ఏ నుండి నాటా మాజీ అధ్యక్షుడు, ఫిలడెల్ఫియా డా.రాఘవ రెడ్డి గోసాల,శంకర నేత్రాలయ  బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అట్లాంటా , శ్రీని వంగిమల్ల,  కలైవాణి డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, అట్లాంటా,పద్మజ కేలం, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ , రాక్‌విల్   ఉదయ్ భాస్కర్ గంటి,  శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆస్టిన్, డాక్టర్ జగన్నాథ్ వేదుల, జెర్మనీ నుంచి రాజా రమేష్ చిలకల, భారతదేశం నుంచి బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974)  మచిలీపట్నం, కోలపల్లి వి.ఆర్.హరీష్ నాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ,ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కక పోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గుర్తించి  భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జెర్మనీ, నెథర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్  స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 143 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (శిగ్నతురె ఛంపైగ్న్) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: 

https://www.change.org/BharatRatnaForGhantasalaGaru

ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ మెయిల్ ఐడి కి [email protected] వివరాలు పంపగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com