భారత్ కరోనా అప్డేట్
- July 07, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,19,457 మందికి చికిత్స అందుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే 4,245 పెరిగింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,29,21,977కి పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 5,25,305కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 198,33,18,772 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. నిన్న 11,44,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2కి ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి కూడా జరుగుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







