టాలీవుడ్‌కి ఇంకో కొత్త హీరోయిన్ దొరికిందా.?
- July 07, 2022
టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఏ రేంజ్‌లో వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తిప్పి కొడితే స్టార్ హీరోయిన్లు.. అంటే, సమంత, కాజల్ అగర్వాల్.. రష్మిక మండన్నా, పూజా హెగ్దే.. ఇలా వేళ్ల మీద చెప్పదగగ్గ పేర్లే కనిపిస్తున్నాయ్.
ఎందుకలా.? కొత్త భామలు టాలీవుడ్‌కి రావడం లేదా.? అంటే వస్తున్నారు కానీ, నిలబడలేకపోతున్నారు.రీసెంట్ హీరోయిన్లలో ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.వరుస అవకాశాలు దక్కించుకుంటూ, స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోవడానికి జోరుగా అడుగులు వేస్తోంది.
ఆ కోవలోనే సంయుక్తా మీనన్, శ్రీలీల తదితర ముద్దుగుమ్మలు క్యూలో వున్నారు. కానీ, ఎంత మేర సక్సెస్ అవుతారన్నది ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి.ఇదిలా వుంటే, తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ తెరపై ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు, మృణాళ్ ఠాకూర్.
బాలీవుడ్ భామ అయిన మృణాల్ ఠాకూర్.. తెలుగులో ‘సీతారామం’ అనే సినిమాతో అడుగు పెట్టబోతోంది.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అమ్మడి పేరు మార్మోగిపోతోంది.అంతేకాదు, తొలి సినిమా రిలీజ్ కాకుండానే అవకాశాలు కూడా దక్కించుకుంటోందట మృణాల్ ఠాకూర్.
అమ్మడి జోరు ఇలాగే కొనసాగితే, టాలీవుడ్‌కి మరో కొత్త భామ వచ్చి చేరినట్లే.ఇక ఈ సినిమాకి సంబంధించి వివరాల్లోకి వెళితే, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోంది ‘సీతారామం’. ఈ సినిమాలో రష్మిక మండన్నా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







