భారత్ కరోనా అప్డేట్
- July 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 43 మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,25,028 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.14 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4,36,04,394
కేసులు నమోదు కాగా వారిలో 5,25,386 మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది.
నిన్న కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కిచేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో గడిచిన 540 రోజులుగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు198,65,36,288 కోట్ల డోసుల టీకాలు వేశారు. నిన్న ఒక్కరోజే 12,26,795 డోసుల టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







