అతివాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకమవ్వాలి

- April 12, 2016 , by Maagulf
అతివాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకమవ్వాలి

ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, క్రౌన్‌ ప్రిన్స్‌ - డిప్యూటీ సుప్రీం కమాండర్‌ మరియు ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిల్‌ మమాద్‌ అల్‌ ఖలీఫా, అతి వాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. గుడైబా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో వీరు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. ఇస్లామిక్‌ దేశాల్లో ఆర్థిక, సామాజిక స్థితిగతులపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. గల్ఫ్‌ దేశాల్లో పరిస్థితుల గురించీ చర్చించారు. తీవ్రవాదంపై చర్చించిన వీరు, ఏ రూపంలో ఉన్నా తీవ్రవాదాన్ని సహించరాదని, ప్రపంచమంతా ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చర్చా కార్యక్రమాలు, సమావేశాలు జరగాలని, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com