కనువిందు చేయనున్న అతిపెద్ద సూపర్‌మూన్
- July 13, 2022
యూఏఈ: ఈ సంవత్సరంలో అతిపెద్ద సూపర్‌మూన్ జూలై 13న ప్రపంచవ్యాప్తంగా కనిపించనుంది. 2022లో వచ్చే నాలుగు సూపర్‌మూన్‌లలో ఇది భూమికి అత్యంత దగ్గరగా ఉండనుంది. ఇది సాధారణం కంటే పెద్దదిగా.. ప్రకాశవంతంగా కనిపించనుంది. ఇది ఎమిరేట్స్‌లో సాయంత్రం 6.07 గంటల నుండి కనిపిస్తుంది. దీనిని సాధారణ కంటితో చూడవచ్చు. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా మరింత స్పష్టంగా చూడవచ్చు. ఈ సంవత్సరంలో ఇది మూడవ సూపర్‌మూన్. భూమి-చంద్రుడు సగటు దూరం 384,472కిమీతో పోలిస్తే 357,418 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు. మొదటి సూపర్ మూన్(భూమికి 362,127కిమీ దూరం) మే 16న కనిపించింది. రెండవది(357,658కిమీ దూరం) జూన్ 14న.. చివరిది ఆగస్టు 12న కన్పించింది. సాధారణ పౌర్ణమి చంద్రుని కంటే 17 శాతం పెద్దదిగా.. 30 శాతం ప్రకాశవంతంగా సూపర్ మూన్ కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









