ఇంట్లో గంజాయి సాగు చేసిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- July 13, 2022
బహ్రెయిన్: తన ఇంటిలో గంజాయిని పండించినందుకు 15 ఏళ్ల పాటు జైలు శిక్ష పడ్డ వ్యక్తి అప్పీల్‌ను హై అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. అప్పీల్‌ను తిరస్కరించడంతోపాటు BD10,000 జరిమానా విధించింది. గంజాయి సాగు గురించి తనకు తెలియదని, తాను నాటిన విత్తనాలు పండ్లు, కూరగాయలవి సదరు వ్యక్తి కోర్టులో వాదించాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ వీధుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తులు అందిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు అతని వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత అనుమానితుడి ఇంటిని పరిశీలించగా గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే అనేక పరికరాలు, సాధనాలను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







