భారీ సంఖ్యలో ప్రవాసుల అరెస్ట్
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.తాజాగా హవాలీ గవర్నరెట్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో 34 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వీరంతా తమ రెసిడెన్సీ గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా ఆ దేశంలో ఉంటున్నట్లు తెలిపారు.అలాగే మరో చోట నిర్వహించిన తనిఖీల్లో మరో 26 మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.గృహ కార్మికులను రిక్రూట్ చేసే ఓ ఫేక్ ఆఫీస్‌పై అధికారులు ఆకస్మీక దాడి నిర్వహించారు.దీంతో అక్కడ 26 మంది ప్రవాసులు దొరికినట్లు తెలియజేశారు.
ఇటీవల దేశవ్యాప్తంగా వరుస సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఇలా భారీ సంఖ్యలో వలసదారులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడుతున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే కువైట్ అధికారులు అమ్నెస్టీ పథకం కింద పలుమార్లు నివాస గడువు ముగిసిన ప్రవాసులను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా మంది దాన్ని ఉపయోగించుకోలేదు.నివాస అనుమతి గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు.అలాంటి వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడంతో పాటు జీవితంలో మళ్లీ కువైట్ రాకుండా నిషేధం విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..