కువైట్ లో ఏపీ వాసికి ఏపీఎన్ఆర్టీఎస్ వారి చేయూత

- July 15, 2022 , by Maagulf
కువైట్ లో ఏపీ వాసికి ఏపీఎన్ఆర్టీఎస్ వారి చేయూత

కువైట్ సిటీ: కువైట్ లో జీవనోపాధి కొరకు వచ్చి,భీమవరం కు చెందిన, ఫ్రాన్క్లిన్ రాజు అనే వ్యక్తి గత  20 సంవత్సరాలుగా కువైట్ లో బయట పని చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. గతంగా రెండు రోజుల క్రితం అనారోగ్యం చేందడంతో,ఈ విషయం ఇండియా లోని వారి కుటుంబ సభ్యులు  ఏపిఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి  వెంకట్ మరియు డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి తెలపడం జరిగింది.వారు వెంటనే స్పందించి వైఎస్సార్సిపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తిసుకు రావడం జరిగింది. బాలిరెడ్డి రెడ్డి సూచన మేరకు ఈరోజు ఉదయం వైఎస్ఆర్సిపీ యువజన విభాగం నాయకులు, మర్రి కల్యాణ్ మరియు హనుమంత్ రెడ్డి, హరి ప్రసాద్ చౌదరి, తదితరులు ఆసుపత్రికి వెళ్లి అతని అరోగ్య పరిస్థితి,క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొన్నారు. 

రాజు మాట్లాడుతూ...తన అరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వారికి తెలియచేసినారు.అతని అరోగ్యం మెరుగుపడిన వెంటనే ఇండియా కు స్వస్థలానికి పంపుటకు, వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి,పేపర్ వర్క్ పనులు పూర్తి చేసి సురక్షితంగా పంపడం జరుగుతుందని మర్రి కళ్యాణ్ తెలియజేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com