జబర్దస్త్ రచ్చ: అప్పుడేమో అమ్మ.. ఇప్పుడేమో అసహ్యం.!

- July 16, 2022 , by Maagulf
జబర్దస్త్ రచ్చ: అప్పుడేమో అమ్మ.. ఇప్పుడేమో అసహ్యం.!

‘అప్పుడేమో జబర్దస్త్ అమ్మలాంటిది.. మాకు అన్నం పెట్టింది..’ అన్నాడు జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్‌పీ. ఇప్పుడేమో జబర్దస్త్ పేరు చెబితేనే అసహ్యం పుడుతోంది.. అంటున్నాడు. అసలు జబర్దస్త్‌లో ఏం జరుగుతోంది.?
ఇప్పటికే చాలా మంది కమెడియన్లు జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఈ మధ్యనే అనసూయ కూడా బయటికి వచ్చేసింది. ఈ టైమ్‌లో ఆర్‌పీ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయ్.

సోషల్ మీడియా వేదికగా ఆర్‌పీ ఇస్తున్న ఇంటర్వ్యూలు చాలా దారుణమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నాయ్ జబర్దస్త్ షో మీద. జబర్దస్త్ ప్రొడ్యూసర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ, మల్లెమాలనీ, ఆ మాటకొస్తే ఏకంగా ఈటీవీని సైతం ఆర్‌పీ ఆడి పోసుకుంటున్నాడు.
ఆర్‌పీ వీరంగానికి జబర్దస్త్‌లో ఏం జరుగుతోందా.? అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా వుంటే, జబర్దస్త్ కమెడియన్లు అయిన ఆది, రామ్ ప్రసాద్ మాత్రం ఆర్‌పీ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. 

జబర్దస్త్ అప్పటికీ ఇప్పటికీ అమ్మవంటిదే అని వారు సమర్ధిస్తున్నారు. ఆర్‌పీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎంతో మంది కమెడియన్లు జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ షో నుంచి బయటికి వచ్చిన వాళ్లు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. అయితే ఈ మధ్య జబర్దస్త్ షోకి కాస్త ఆదరణ తగ్గిన మాట వాస్తవమే. నాగబాబు మొదట ఈ షో నుంచి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటికి వస్తూనే వున్నారు. అసలేమైంది జబర్దస్త్‌కి.! తెలియాల్సి వుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com