కారు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మృతి

- July 16, 2022 , by Maagulf
కారు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మృతి

మనామా: హమాద్ టౌన్ కు వెళ్ళే ఖలీఫా బిన్ సల్మాన్ వీధిలో నిన్న జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మేజర్ సాద్ నాసిర్ అల్ హాజాని మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించింది. 

ట్రాఫిక్ నియమాలను పాటించ కుండా వెళ్తున్న వాహనాలను పట్టుకునే ప్రయత్నంలో హాజాని ప్రయాణిస్తున్న కారును ట్రాక్ డీ కొట్టడంతో తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపింది. ప్రమాదంలో గాయపడిన వారిని జాతీయ అంబులెన్స్ బృందం హాస్పిటల్ కు చేర్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com