ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్
- July 16, 2022
న్యూ ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇందులోనే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి రేసులో జగదీప్ ధన్కర్ పేరు వినపడకపోయినప్పటికీ ఆయననే బీజేపీ పోటీలో దింపుతోంది. వచ్చే నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. కాగా, జగదీప్ స్వస్థలం రాజస్థాన్. ఆయన కెరీర్ మొదట్లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ సింగ్ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







