మస్కట్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిరిండియా ఎక్ష్ప్రెస్స్ విమానం
- July 17, 2022
మస్కట్: అత్యవసర స్థితితో విమానాల దారి మళ్లింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కొనసాగుతూనే ఉంది.విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు.శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్లో ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన ఐఎక్స్-355 విమానం కాలికట్ నుంచి దుబాయ్ బయల్దేరింది. మార్గమధ్యలో విమానం నుంచి కాలిన వాసన రావడాన్ని పైలట్లు గుర్తించారు. ఏరోప్లేన్ వెంట్ నుంచి ఈ వాసన వస్తున్నట్లు అనుమానం వచ్చింది. విమాన సిబ్బంది కొంతసేపు తనిఖీలు చేసినప్పటికీ ఎక్కడా కాలిపోయి ఉండటాన్ని గుర్తించలేదు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. విమానంలో ఎక్కడా కాలిపోయిన విషయాన్ని గుర్తించనప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా దగ్గర్లోని మస్కట్లో ల్యాండ్ చేశారు.
ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. భారత విమానాలకు సంబంధించి 24 గంటల్లో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. శనివారం ఇథియోపియాకు చెందిన విమానం ఒకటి అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా, కోల్కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







