‘పుష్ప..’ రెండు కాదు మూడు.! అయ్యో.! అల్లు అర్జున్ ఇరికేసినాడే.!
- July 19, 2022అల్లు అర్జున్, రష్మికా మండన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. నిజానికి చాలా సాదా సీదాగా తెరకెక్కిన ఈ సినిమా, ప్యాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది.
ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని విలన్ ఫహాద్ పాజిల్‌తో పోలీస్ స్టేషన్ సీన్ తెరకెక్కించేటప్పుడే ఆలోచన చేశాడట డైరెక్టర్ సుకుమార్. అది కూడా ఫహాద్ ఫాజిల్ నేపథ్యంలోనేనట. అంటే, సెకండ్ పార్ట్ మొత్తం ఫహాద్ ఫాజిల్ వైపు నుండే వుండేలా ప్లాన్ చేశాడన్న మాట.
అందుకు తగ్గట్లుగానే మొదటి పార్ట్‌ని అక్కడే కట్ చేశాడు సుకుమార్. ఓకే, ‘పుష్ప 2’ కోసం ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా అప్డేట్ ప్రకారం, ‘పుష్ప’ రెండో పార్టే కాదు, మూడో పార్ట్ కూడా వుండబోతోందట.
ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ, మూడో పార్ట్ కోసం కూడా రెడీగా వుండమని ఫహాద్ ఫాజిల్‌కి సుకుమార్ సూచించాడట. తాజాగా ఆయన ఇదే విషయాన్ని బయటికి చెప్పేశారు. కావాలనే చెప్పారో, అనుకోకుండా చెప్పారో కానీ, ‘పుష్ప 3’ సీక్రెట్ రివీల్ అయిపోయింది.
అయితే, మరి బన్నీ పరిస్థితేంటీ.? ఇప్పటికే పుష్ప రెండో పార్ట్ సెట్స్ మీదికెళ్లడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇక మూడో పార్ట్ అంటే, అది కూడా పూర్తయ్యే వరకూ బన్నీ వేరే డైరెక్టర్‌కి కమిట్ అవ్వడానికి లేదు కదా. ఇలా అయితే, బన్నీ ఒకే డైరెక్టర్‌తో ఇంకెన్నాళ్లో.. ఇరుక్కుపోయాడుగా.!
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..