కొరటాలకు ‘ఆచార్య’ తలనొప్పి: ఇప్పుడు మరో ట్విస్ట్‌నా.?

- July 19, 2022 , by Maagulf
కొరటాలకు ‘ఆచార్య’ తలనొప్పి: ఇప్పుడు మరో ట్విస్ట్‌నా.?

‘ఆచార్య’ తలనొప్పి కొరటాల శివను వదిలిపెట్టడం లేదు. మరే ఇతర సినిమాకీ లేని విధంగా ‘ఆచార్య’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి, ప్రొడక్షన్, మార్కెటింగ్, ప్రమోషనూ.. ఇలా కర్త, కర్మ, క్రియ.. అంతా తానే అయ్యి బాధ్యత తీసుకున్నాడు కొరటాల.
దాంతో సినిమా డిజాస్టర్ బాధ్యత కూడా ఆయనదే అయ్యింది. రిలీజ్‌కి ముందు సినిమాని భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మేశాడు. కానీ రిలీజ్ తర్వాత బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దాంతో అన్నింటికీ బాధ్యత తీసుకున్న కొరటాలే ఆ నష్టం పూడ్చాలనీ బయ్యర్లు ఆయన ఆఫీస్ ముందు ఆందోళన చేయగా, ఎలాగోలా ఆ వివాదం నుంచి బయట పడ్డాడు కొరటాల శివ.
నెల రోజుల్లో దాదాపు నాలుగున్నర కోట్లు సెటిల్ చేస్తానంటూ కొరటాల శివ బయ్యర్లకు హామీ ఇవ్వడంతో ఆ గొడవ ప్రస్తుతానికి సద్దుమనిగింది. కొరటాల కూడా కాస్త ఊపిరి తీసుకున్నారు. 
అయితే, తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఓ ఛానెల్ తమ అడ్వాన్స్ తిరిగివ్వమని కొరటాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. దాదాపు 14 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయట. ఇప్పుడు ఆ మొత్తం అమౌంట్ తిరిగివ్వాలంటూ సదరు శాటిలైట్ సంస్థ కొరటాలను రచ్చకీడ్చే ప్రయత్నాలు చేస్తోందట. మళ్లీ కొరటాల చిక్కుల్లో పడ్డట్లే.. ఇలా అయితే, తన తదుపరి చిత్రం ఎన్టీయార్ సినిమాని ఇంకెప్పుడు పట్టాలెక్కిస్తాడో కొరటాల చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com