యూఏఈలో గంజాయి సాగుచేస్తున్న ఇద్దరు అరెస్ట్
- July 20, 2022
యూఏఈ: తమ యజమాని పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను అబుదాబి పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో అబుదాబి పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. గంజాయి మొక్కలను నిర్మూలించాలని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తాహెర్ గరీబ్ అల్ ధాహెరి మాట్లాడుతూ.. వ్యవసాయ యజమానులు పొలాల వద్ద తమ కార్మికులపై నిఘా పెట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పెంచడం వంటివి కన్పిస్తే అధికారులకు నివేదించాలని అల్ ధాహెరి వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టడానికి.. పెడ్లర్లు, వినియోగదారుల సమాచారం తెలిస్తే 999 లేదా 8002626 ద్వారా తెలపాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







