'సీతారామం' నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల
- July 20, 2022
హైదరాబాద్: యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ 'సీతారామం'. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వినీదత్
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో : వంశీ-శేఖర్
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







