నకిలీ విగ్రహాల విక్రయం.. లండన్ ఆర్ట్ డీలర్‌పై కేసు పెట్టిన ఖతార్ షేక్

- July 21, 2022 , by Maagulf
నకిలీ విగ్రహాల విక్రయం.. లండన్ ఆర్ట్ డీలర్‌పై కేసు పెట్టిన ఖతార్ షేక్

ఖతార్: £4.2 మిలియన్లు తీసుకొని 'నకిలీ' పురాతన విగ్రహాలను అంటగట్టడం ద్వారా తనను మోసగించినట్లు ఆర్ట్ డీలర్‌పై లండన్ కోర్టులో ఖతార్ షేక్‌ దావా దాఖలు చేశాడు. జాన్ ఎస్కెనాజీ ఆర్ట్ కలెక్టర్ తనను పురాతన విగ్రహల పేరిట మోసం చేశాడని షేక్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ ఆరోపించారు. తనకు అమ్మిన విగ్రహలు 1,400, 2,000 సంవత్సరాల క్రితం నాటివని డీలర్ తనకు చెప్పినట్లు షేక్ కోర్టులో పేర్కొన్నారు. కానీ అవి నకిలీవని నిపుణులు తేల్చడంతో వాటిని వాపస్ తీసుకొని తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరినా.. ఆర్ట్ డీలర్‌ నిరాకరించినట్లు తెలిపాడు. తన అమ్మిన విగ్రహాల్లో మట్టి, ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నాయని నిపుణులు తేల్చారని ఖతార్ షేక్ కోర్టులో వాదించారు. అయితే ఆర్ట్ డీలర్ జాన్ ఎస్కెనాజీ.. ఖతార్ షేక్ వాదనలను తిరస్కరించాడు. ప్రస్తుతం లండన్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com