తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..
- July 21, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఎన్ని సంస్థలు తెలంగాణ లో వారి వ్యాపారాలు మొదలుపెట్టగా..తాజాగా ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో గురువారం జరిగిన భేటీలో ఈ ప్రకటనను తెలిపారు సంస్థ ప్రతినిధులు.
జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో రూ.1800కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీని వల్ల 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ – ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







