కానిస్టేబుల్‌ ధైర్యానికి దేశంలోనే అత్యున్నత గౌరవం అభినంధించిన సైబరాబాద్ సీపీ

- July 21, 2022 , by Maagulf
కానిస్టేబుల్‌ ధైర్యానికి దేశంలోనే అత్యున్నత గౌరవం అభినంధించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్: ఈరోజు i.e., 21.07.2022  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,  భారత ప్రభుత్వం ద్వారా ప్రధానం చేయబడిన ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ పతకాన్ని అందుకున్న సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ కు చెందిన  పోలీసు కనిస్టేబుల్ జి. శివ కుమార్ ను అభినందించారు.
 
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి పోలీసు అధికారి విధి నిర్వహణకు మించి ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయాలని సూచించారు.
 
2018 సంవత్సరానికి గాను సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని  కేశంపేట్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ అధికారి జి. శివకుమార్‌ పిసికి *ప్రధానమంత్రి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ లైఫ్‌ సేవింగ్‌ అవార్డు* ను తేదీ 14.07.2022 న భారత ప్రభుత్వం ప్రధానం చేయడం జరిగింది.  అయితే  తేదీ 9.10.2017 న రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో కానిస్టేబుల్ జి. శివ కుమార్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ డ్యూటీ చేస్తన్న సమయంలో.. భారీ వర్షాలకు షాద్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన గడిగెల శేఖర్ గౌడ్ చెరువులో కొట్టుకుపోయాడు. డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పిసి జి శివ కుమార్‌ బాధితుడిని (శేఖర్ గౌడ్) తాళ్ల సహాయంతో రక్షించేందుకు పక్కాగా ప్లాన్ చేసి, పోలీసు స్పెక్టర్ ఆదేశాల మేరకు పిసి జి శివకుమార్ వెంటనే నీటిలోకి దూకి 100 మీటర్ల దూరంలో ప్రవహించే నీటిలో ఇరుక్కుపోయిన బాధితుడిని తాడు సహాయంతో రక్షించాడు. మరియు అర్ధరాత్రి బాధితుడిని సుమారు 100 మీటర్ల దూరం నుండి సేఫ్ జోన్‌కు తీసుకువచ్చారు. రెస్యూస్ ఆపరేషన్‌కి గంటన్నర సమయం పట్టింది.బాధితుడికి వైద్య సహాయం అందించి అతని బంధువులకు  అప్పగించారు.తనకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన పీసీ జి.శివ కుమార్ కృషిని అభినందిస్తున్న భారత ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ పతకాన్ని అంధించడం జరిగింది.
 
ఈ కార్యక్రమం లో సీపీ తో పాటు  షాద్ నగర్ ఏసీపీ  కుషాల్కర్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com