టెట్రా ప్యాక్ ల ద్వారా మద్యాన్ని విక్రయించే ఆలోచనలేదు- మంత్రి కొల్లు రవీంద్ర
- April 13, 2016
బందరు పోర్టు నిర్మాణానికి మరో 10 రోజుల్లో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మచిలీపట్నం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ బీసీ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బుధవారం విజయవాడలో కొల్లు రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే మచిలీపట్నం పోర్టు అథారటీ, మున్సిపల్ పరిపాలన, న్యాయ విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకుందని ఆయన వివరించారు.
పోర్టు, పరిశ్రమల నిర్మాణానికి కూడా భూమిని వేర్వేరుగా కేటాయిస్తామన్నారు. రైతులతో చర్చించి అమరావతి తరహాలోనే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. త్వరలోనే ఆధరణ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆధరణ పథకం అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన విశదీకరించారు. చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అయితే రాష్ట్రంలో టెట్రా ప్యాక్ ల ద్వారా మద్యాన్ని విక్రయించే ఆలోచన మాత్రం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







