సీక్రెట్ టాలెంట్ బయట పెట్టిన నితిన్ హీరోయిన్.!
- July 22, 2022
‘లై’ బ్యూటీ మేఘా ఆకాష్ అంటే కేవలం నటి మాత్రమే కాదండోయ్. అమ్మడిలోనూ కొన్ని సీక్రెట్ టాలెంట్స్ వున్నాయ్. అందులో ఒకటి తాజాగా బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తమిళంలో ఓ సినిమా కోసం తనలోని సింగింగ్ టాలెంట్‌ని బయటకి తీసింది మేఘా ఆకాష్. ‘సింగిల్ శంకరం స్మార్ట్‌ఫోన్ సమ్రానుం’ అనే ఓ తెలుగు సినిమా కోసం మేఘా ఆకాష్ తన గొంతు సవరించుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన మేఘా ఆకాష్ ఆడియో సాంగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాగా, ‘లై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాష్, ఆ తర్వాత కూడా నితిన్‌తోనే (ఛల్ మోహన్ రంగ సినిమా) జత కట్టడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ నితిన్‌తో రెండు సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఈ లోపు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. అందులో రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సినిమాలుండడం మరో విశేషం.
కాగా, రీసెంట్గా శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘రాజ రాజ చోర’ సినిమాతో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, హిందీ సినిమాల్లోనూ మేఘా ఆకాష్ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’, ‘రావణాసుర’, ‘డియర్ మేఘా’ తదితర సినిమాల్లో మేఘా ఆకాష్ నటిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







