నయా ట్రెండ్: నయన్ పెళ్లి సినిమా ఎంత బిజీనెస్ చేసిందో తెలుసా.?

- July 22, 2022 , by Maagulf
నయా ట్రెండ్: నయన్ పెళ్లి సినిమా ఎంత బిజీనెస్ చేసిందో తెలుసా.?

సౌత్ క్వీన్‌గా చెలామణీ అవుతోన్ననయన తారకు సంబంధించి ఏ ఇష్యూ అయినా అదో సెన్సేషనే. ఇటీవలే నయన తార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇంతవరకూ లవ్వు, డేటింగ్ న్యూస్‌తోనే ఊదరగొట్టిన నయన తార ఎట్టకేలకు పెళ్లి కావడంతో, అదో పెద్ద సెన్సేషనే అయ్యింది. ఇక ఈ వివాహ వేడుకనంతా కనీ వినీ ఎరుగని రీతిలో ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలాగా ఎడిట్ చేసి, డైరెక్ట్ చేశాడు. 

నయన్ పెళ్లి వీడియో డాక్యుమెంటరీ అనే పేరుతో దీన్ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్ చేసి కొనుగోలు చేసింది. అది అక్షరాలా 200 కోట్లు. చూశారా నయన్ పెళ్లి డాక్యుమెంటరీకున్న క్రేజ్ అలాంటిది మరి. మూడు నాలుగు సినిమాలు చేసినా రాని రెమ్యునరేష్ ఇది. పెళ్లయినా కూడా క్రేజ్ తగ్గకపోవడం అంటే ఇదే మరి. అందుకే ఆల్వేస్ నయన తార ట్రెండింగే సుమీ.!

ఇంత హంగామా వుంది కాబట్టే ఇంతవరకూ నయన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకి రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక తాజాగా కొన్ని అన్ సీన్ ఫోటోలను రిలీజ్ చేస్తూ, సదరు ఓటీటీ సంస్థ (నెట్ ఫ్లిక్స్) త్వరలో ఈ వీడియోని తమ ఛానెల్‌లో ప్రసారం చేయబోతున్నాం అంటూ అనౌన్స్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com