నిర్మాతగా అమలాపాల్ సరికొత్త ప్రయోగం.!
- July 22, 2022
మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ నిర్మాతగా మారింది. స్వీయ నిర్మాణంలో అమలాపాల్ ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా పేరు ‘కడవర్’. మెడికో థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
‘కడవర్’ అంటే ఏంటీ.? డెడ్ బాడీ అని అర్ధమట. అయితే, ఈ సినిమాలో అమలా పాల్ ఏం చేయనుంది.? అంటే అది సినిమా చూస్తే కానీ తెలీదు. అన్నట్లు ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారట. ప్రముఖ ఓటీటీ ఛానెల్ హాట్ స్టార్ వేదికగా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా వుంది.
ఆ మాటకొస్తే ప్రయోగాలకు పెట్టింది పేరు అమలాపాల్. గతంలో ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాలో నటించి తొలుత వివాదాలు మూట కట్టుకున్నా, సినిమా చూశాకా, అమలాపాల్ సాహసాన్ని అందరూ మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
అలాగని కమర్షియల్ సినిమాలకూ అమలా పాల్ దూరం కాదు. తెలుగులో ‘బెజవాడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్, ఆ తర్వాత ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’, ‘లవ్ ఫెయిల్యూర్’ తదితర డిఫరెంట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..